తెలంగాణ

దురవస్థలో తెలుగు వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: సొంత భవనాలు లేక దురవస్థలో తెలుగు యూనివర్శిటీ ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. లేఖను పాత్రికేయులకు విడుదల చేస్తూ, ప్రపంచ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమే అయినా, తెలుగు సంబంధిత సంస్థల కార్యకలాపాలు, పనితీరుపై ప్రభుత్వ పర్యవేక్షణ, నిధుల కేటాయింపు తదితర అంశాలపై సమగ్రంగా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు భాష పురోగతి కోసం తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం , అధికార భాషా సంఘం, తెలంగాణ సారస్వత పరిషత్, తెలుగు భాషా సమితి, శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం తదితర అనేక సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. అందులో ప్రధానమైనది తెలుగు యూనివర్శిటీ అని అన్నారు. 1980లో హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఏర్పాటైందని, వరంగల్, శ్రీశైలం, రాజమండ్రిలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశారని ఉస్మానియా యూనివర్శిటీలో హాస్టల్, పబ్లిక్ గార్డెన్స్‌లో కాలేజీ, లైబ్రరీ తిరిగి విద్యానగర్‌లో ఉన్నాయని, 2003లో అప్పటి ప్రభుత్వం 100 ఎకరాల విశాల ప్రాంగణంలో నూతన క్యాంపస్‌కు శ్రీకారం చుట్టిందని, విద్యార్థుల వసతి గృహాలు, గ్రంథాలయం, కళాశాల, పరిపాలనా భవనం నిర్మాణానికి పనులు మొదలయ్యాయని అయితే అవి నేటికి పూర్తి కాలేదని పేర్కొన్నారు. సుమారు 50 గదులతో 2005లో ప్రారంభమైన ఈ నూతన భవన హాస్టల్‌లో 100 మంది విద్యార్థులుండేవారని, ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. హాస్టల్‌లో మంచి నీటి వసతి లేదని, స్థానిక గ్రామ పంచాయితీ దయతలచి రోజూ ఒక ట్యాంకర్ నీరు పోస్తున్నారని, విద్యార్థులు క్లాసులకు పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లాలని, బస్సు సౌకర్యం లేదని అన్నారు. హాస్టల్ నిర్వహణ కూడా సక్రమంగా లేదని అన్నారు. విద్యార్ధులు అంతా రెండు స్నానం గదులతోనే సర్దుకోవల్సి వస్తోందని, వారు అనారోగ్యానికి గైరైతే పట్టించుకునే నాథుడే లేడని చెప్పారు. 2005లోనే గ్రంథాలయం పూర్తయినా, దానిని తెరిచేవారు లేరని, ఎన్నో విలువైన పుస్తకాలు చెదలు పట్టే ప్రమాదం ఉందని, దుమ్ము ధూళితో నిండిపోయిందని అన్నారు. అలాగే పరిపాలనా భవనం, కళాశాల భవనం దురవస్థలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుగు యూనివర్శిటీ దుస్థితిపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.