తెలంగాణ

వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి దీక్ష..అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ట్యాంక్ బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద వౌనదీక్షకు దిగారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అతణ్ని అరెస్టు చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కాస్సేపు ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణమాదిగను అరెస్టు చేయడం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్‌కు తాము వ్యతిరేకం కాదు..అణగదొక్కితే తిరగబడతామంటూ కంటతడిపెట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పాలన్నారు. మంద కృష్ణను వెంటనే విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. ఇదిలావుండగా మంద కృష్ణమాదిగ బెయిలు పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు రానుంది.