తెలంగాణ

చితికిపోతున్న విద్యారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, ప్రైవేటు రంగంలో ఉన్న చిన్న చిన్న విద్యాసంస్థలను మాత్రం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థలపై ఏదో కసి పెట్టుకుని , మూసివేసే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పిజి కాలేజీల యాజమాన్యాల సంఘాల జెఎసి ఆధ్వర్యంలో గురువారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. జాక్ చైర్మన్ రమణారెడ్డి అధ్యక్షత వహించగా, రౌండ్‌టేబుల్‌లో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బిజెపి నేత వెంకటరెడ్డి, బిసి నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, సిపిఎం, సిపిఐ నేతలు డిజి నర్సింహరావు, బాల మల్లేష్, సంఘం ప్రధానకార్యదర్శి విజయభాస్కరరెడ్డి, ట్రస్మా నేతలు పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, ఇతర నేతలు మధుసూధన్ జోషి, సూర్యనారాయణ రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. పదేళ్లుపూర్తయి , ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని రకాల విద్యాసంస్థలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోని సిబ్బందికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా ఇవ్వాలని, జూనియర్ కాలేజీల ట్యూషన్ ఫీజును కామర్స్ , ఆర్ట్సు కోర్సులకు 12వేలు, సైన్స్ కోర్సులకు 25వేల రూపాయిలకు పెంచాలని, సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించాలని, డిగ్రీ, పిజి కాలేజీలలో ఫీజులను పెంచాలని, జూనియర్ డిగ్రీ కాలేజీలకు , పాఠశాలలకు ధరలకు రెండు ఎకరాల భూమిని కేటాయించాలని జాక్ నేతలు కోరారు. నాణ్యమైన విద్యకు బ్లూప్రింట్ ప్రకటించాలని, అన్ని రకాల పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలని, ప్రీ ప్రైమరీ గుర్తింపును సరళతరం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా టిపిసిసి నేత ఉత్తమ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాము జాక్ నేతల పోరుకు తోడు ఉంటామని అన్నారు. ఇంత దాకా వచ్చారు కనుక ఎంత వరకైనా వెళ్లాలని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొనగా, ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని బిజెపి నేత వెంకటరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు.