తెలంగాణ

సంధ్యారాణి హంతకుడు కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: నగరంలోని లాలాగూడలో సంధ్యారాణి అనే యువతిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ప్రేమోన్మాది కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ దారుణ సంఘటనను నిరసిస్తూ లాలాపేట, ముషీరాబాద్‌లో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దిష్టిబొమ్మ దగ్ధం చేసి, నిరసన చేపట్టినట్లు ఐద్యా నగర సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు కె.నాగలక్ష్మి, కార్యదర్శి ఆర్.అరుణజ్యోతి తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో ముందుండి పాల్గొనే తెలంగాణ ఎంపి కవిత మహిళలపై దాడులు జరిగినప్పుడు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నగరంలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ఇటువంటి కేసులను తక్షణం పరిష్కరించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు పలువురు పాల్గొన్నారు.
నిందితుడిని ఉరితీయాలి
సంధ్యారాణి హంతకుడు కార్తీక్‌ను ఉరితీయాలని బిసి మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది. నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టడం దారుణం, అమానుషమని వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఆలంపల్లి లత తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వారికి ఉరి శిక్ష కాదు ఏమి చేసినా తక్కువేనని అన్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని ఇలాంటి నేరగాళ్లు మళ్లీ జనారణ్యంలోకి వస్తున్నారని అన్నారు. ఇలాంటి సంఘటనలకు మరెవరూ పాల్పడకుండా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.