తెలంగాణ

‘కేసీఆర్ వైఖరి మారకపోతే ఇంటిబాట పట్టిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే ఇంటిబాట పట్టిస్తామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. ఏ ఒక్క సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేదని మండిపడ్డారు. శుక్రవారం నాడిక్కడ సిపిఐ రాష్ట్ర కార్యాయలం మఖ్ధూం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఈర్ల నరసింహతో కలిసి చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. భూ మాఫియా, రైతుల సమస్యలు, నయిం కేసు, నిరుద్యోగం వంటి సమస్యలపై వామపక్ష శక్తులతో కలిసి ఐక్యంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.