తెలంగాణ

ఓయూ ప్రతిష్ఠ మంటగలుపుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఒయు ప్రతిష్టను మంటగలిపేలా జాతీయ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేస్తూ కెసిఆర్ సర్కార్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పథకం ప్రకారమే వాయిదావేసిందని ఆయన అన్నారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల నిర్వహణకు ఒక్క సమీక్ష కూడా సిఎం నిర్వహించలేదని అన్నారు.
యూనివర్శిటీ అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకున్నా విద్యార్ధులకు ముందే సెలవులు ప్రకటించినా, పరీక్షలు వాయిదా వేసినా ప్రభుత్వం మాత్రం వర్శిటీ పరువుతీసిందని పేర్కొన్నారు. నోబెల్ గ్రహీతలు సభలకు రావడానికి ముందే ఏర్పాట్లు చేసుకుని ఉంటారని, వారందరికీ వాయిదా వల్ల అసౌకర్యం కలుగుతుందని అన్నారు. సైన్స్ కాంగ్రెస్ సభలతో పాటు వారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రణాళిక వేసుకుంటారని, వాయిదా వల్ల అన్నీ దెబ్బతింటున్నాయని చెప్పారు.
ఢిల్లీ పర్యటనకు లక్ష్మణ్
రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి మురళీధరరావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చింది.

చిత్రం..శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న
బీజేపీ నేత కిషన్‌రెడ్డి