తెలంగాణ

ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పిజి, యుజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలకు వారం రోజుల్లో షెడ్యూలు ఖరారు చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ చెప్పారు. శుక్రవారం నాడు వారు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే యూనివర్శిటీలకు వివిధ ప్రవేశపరీక్షల నిర్వహణకు సన్నద్ధత తెలియజేయమని కోరామని, అదే విధంగా ప్రతి ప్రవేశపరీక్షకు కన్వీనర్‌గా నియమించేందుకు కనీసం ముగ్గురి పేర్లను సూచించమని కోరామని చెప్పారు. ఆ ముగ్గురిలో నుండి ఒకరిని కన్వీనర్‌గా నియమించనున్నట్టు పాపిరెడ్డి వివరించారు. ఈసారి సకాలంలోనే ప్రవేశపరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రవేశపరీక్షలను ఈసారి ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, తద్వారా వాటి ఫలితాలను వారం పది రోజుల్లో విడుదల చేసేందుకు వీలుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ సంస్థకు ఆన్‌లైన్ ప్రవేశపరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించినట్టు తెలిపారు. టిఎస్‌టిఎస్ సంస్థ టిసిఎస్ సహకారంతో ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే జెఇఇ మెయిన్స్ ఆఫ్ లైన్ ఏప్రిల్ 8న, ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారైంది. అడ్వాన్స్ పరీక్ష మే 20న, నీట్ యుజి పరీక్ష మే 10న నిర్వహించనున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సెట్‌ల తేదీలను ఖరారు చేస్తారు.
శ్రీనిధి, వాసవిపై సుప్రీంలో కేసు
శ్రీనిధి, వాసవి విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సిబిఐటిలో ఫీజులకు సంబంధించి వివాదం ఏమీ లేదని, ఇప్పటికే ఉన్నత విద్యాశాఖామంత్రి, అధికారులు యాజమాన్యానికి స్పష్టంగా చెప్పడం జరిగిందని, విద్యాసంవత్సరం మధ్యలో ఫీజులు పెంచవద్దని చెప్పామని అన్నారు. దానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన
ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్‌చైర్మన్, ప్రొఫెసర్లు