తెలంగాణ

ఇక తెలంగాణపై రాహుల్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఎఐసిసి పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2019లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలోగా తెలంగాణను కలియ తిరగాలని ఆయన భావిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా రాహుల్ టి.పిసిసి నాయకత్వాన్ని ఆదేశించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణలో కొద్దిగా కష్టపడితే పార్టీని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మరింత బలోపేతం చేసుకుని, అధికారం చేపట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. లోక్‌సభ సీట్లనూ ఎక్కువ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందని రాహుల్ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకూ రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర నేతలు ఆయనను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కాగా, కవి, గాయకుడు ఏపూరి సోమన్న నేతృత్వంలో టి.పిసిసి సాంస్కృతిక సేనను ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమించారు. లీగల్ సెల్, ఆర్‌టిఐ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా సి. దామోదర్‌రెడ్డి, మీడియా సలహాదారునిగా తిరుమలగిరి సురేందర్‌ను నియమించారు. కె. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సురేందర్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పని చేశారు.
దానంతో ఫోన్‌లో మాట్లాడిన ఉత్తమ్
ఇలాఉండగా జిహెచ్‌సిసి అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీకి గుడ్-బై చెప్పనున్నట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. దీంతో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. అందుకు దానం స్పందిస్తూ ఎవరో గిట్టని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అని, తాను పార్టీ మారనని స్పష్టం చేశారు.