తెలంగాణ

తోడుగా మేమున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ‘నీకు మేమున్నాం తోడుగా..’ అంటూ 108 అంబులెన్స్ ఉద్యోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తమ సహ ఉద్యోగికి భరోసా ఇచ్చి బాసటగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో 108 అంబులెన్స్ పైలట్ విజయ్ ప్రసాద్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పల్లె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే 108 అంబులెన్స్‌ల నిర్వహణ సంస్థ కేవలం 2500 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నదని ఆయన తెలిపారు. దుర్బరమైన స్థితిలో ఉన్న విజయ్ ప్రసాద్‌ను ఆదుకోవాలని సహా ఉద్యోగులందరం కలిసి వెయ్యి రూపాయలు చొప్పున జమ చేసి, మొత్తం 50 వేల రూపాయలను ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగిందని అశోక్ వివరించారు. వెల్ టెక్ ఫౌండేషన్ చైర్మన్ వీరాచారి, ఆ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, మహబూబ్‌నగర్ జిల్లా 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి యాదయ్య, ఆఫీసు సెక్రటరీ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అశోక్ పల్లె తెలిపారు.