తెలంగాణ

నెత్తురోడిన జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, డిసెంబర్ 24: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో లారీని కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సహాయక చర్యలు చేపడుతున్న హైవే అథారిటీ హెల్పర్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... భువనగిరి పట్టణ శివారులోని రాయగిరి గ్రామ సమీపంలో హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న సిమెంట్ లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనకాల వస్తున్న ఆల్టో కారు లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు వెనకాలే వస్తున్న మరో కారు ఆల్టోకారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీశైలం (30), అచ్చిని శ్రీనివాస్ (27) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదిలావుండగా, ఈ రోడ్డు ప్రమాదం సంఘటనలో సహాయక చర్యలు చేపడుతున్న హైవే అథారిటీ హెల్పర్ కొండల్‌రెడ్డి (42)ని వెనుక నుండి వస్తున్న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతనిని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తొలుత జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో మృతి చెందిన శ్రీశైలం, శ్రీనివాస్ అనే యువకులు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొయ్యాడ గ్రామానికి చెందినవారు. శ్రీనివాస్, శ్రీశైలం ఇద్దరూ స్నేహితులు. ఉప్పల్‌లో కారు మెకానిక్ షాపు నడుపుతూ యాదగిరిగుట్టకు వెళుతూ ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు తెలియజేశారు. కాగా సహాయక చర్యలు చేపడుతూ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన కొండల్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామానికి చెందినవాడు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న భువనగిరి పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం... వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో
నుజ్జునుజ్జయిన కారు, బస్సు