తెలంగాణ

27న తెలంగాణ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్/హైదరాబాద్, డిసెంబర్ 24: చంచల్‌గుడా జైలులో ఉన్న ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఈ నెల 26వ తేదీలోగా విడుదల చేయకపోతే 27న తెలంగాణ బంద్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలపై సమిష్టిగా పోరాడుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నిర్ణయించారు. మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి టిడిపి నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీజేపీ సాంబమూర్తి, సీపీఐ నాయకులు మల్లేష్, అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య అధ్యక్షురాలు విలమక్క, బీసీ సంఘాల నాయకులు ఓరుగంటి వెంకటేశం గౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఎంఆర్‌పీఎస్ నాయకులు నర్సింహా రావు పాల్గొని మాట్లాడారు. వర్గీకరణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే ఆరోగ్యం క్షిణిస్తుందని దీక్షను విరమింప చేసిన మందకృష్ణ మాదిగ.. నాటి ఉద్యమానికి అండగా ఉంటే ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు దిగడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మంద కృష్ణ ఉద్యమం యావత్ దళితుల సంక్షేమం కోసం అని గుర్తుచేశారు. మంద కృష్ణ మాదిగ ఒంటరి కాదని అతనికి అండగా యావత్ ప్రజానికం ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగడం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. ఆనాటి ప్రభుత్వాలు ఇదే నిరంకుశత్వాన్ని కొనసాగించి ఉంటే కేసీఆర్ ఉద్యమాలు చేసేవారా, తెలంగాణ సాధించుకునే వారమా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. నిజాంలోని నిరంకుశత్వాన్ని ఒంటబట్టించుకొని కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంటరానితనాన్ని పాటిస్తున్నారని, క్యాబినెట్‌లో మాలమాదిగ వర్గాలకు చెందినవారు, మహిళలు ఉన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకొని మంద కృష్ణను బేషరత్తుగా విడుదల చేయడంతో పాటు ఆయనపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. ఈనెల 26లోపు మంద కృష్ణను విడుదల చేయక పోతే 27న రాష్ట్ర బంద్‌ను పాటిస్తామని హెచ్చరించారు.
చిత్రం..అఖిలపక్ష సమావేశంలో అభివాదం చేస్తున్న మోత్కుపల్లి, సంపత్, తదితరులు