తెలంగాణ

అంతర్జాతీయ రూట్‌కాలింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: అంతర్జాతీయ రూట్‌కాలింగ్స్‌కు పాల్పడుతోన్న ముఠాగుట్టు రట్టయింది. హైదరాబాద్ పాతబస్తీలో రూట్‌కాలింగ్స్ ద్వారా విదేశాలకు తక్కువ ధరకే చాలా సేపు మాట్లాడించే ముఠాను సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి వద్ద నుంచి రూ. 4.80లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, 9 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పురానీ హవేలిలోని కాన్ఫరెన్స్‌హాలులో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్య కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ మొగల్‌పురాకు చెందిన సయ్యద్ మహమ్మద్ ఇలియాస్ షా బుఖారీ (33), చంద్రాయణగుట్టకు చెందిన మోసిన్ బిన్ మొహమ్మద్ (44), జగిత్యాలకు చెందిన షావాజ్ (20) టోలిచౌకీకు చెందిన డాక్టర్ మహమ్మద్ ఒమర్ (26), ఆసిఫ్‌నగర్‌కు చెందిన మీర్ ముజఫర్ అలీ (32), సికిందరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన మహమ్మద్ జుబేరుద్దీన్ (27), షాలిబండకు చెందిన ఇసా బిన్ సరుూద్ (20) ఒక ముఠాగా ఏర్పడి ఒక మొబైల్ షాపు, ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్నారు. మొగల్‌పురా, టోలీచౌకీ, గోల్కొండలలో వైర్‌లెస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వివోఐపీ) హార్డ్‌వేర్‌ను రూపొందించుకుని దేశ,విదేశాల నుంచి వచ్చే, వెళ్లే అంతర్జాతీయ కాల్స్‌పై దృష్టి సారించారు. ఎవరైనా అంతర్జాతీయ, ఎస్‌టీడీ కాల్స్ ఎక్కువ చేస్తున్నారో వారి వివరాలు సేకరించి, తక్కువ ధరలకే ఎక్కువ సేపు మాట్లాడే వీలుగా కనెక్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ రూట్‌కాలింగ్ ద్వారా ఏ దేశానికైనా, ఎక్కడి నుంచైనా, ఎంత సేపైనా మాట్లాడవచ్చని, వినియోగదారులను ఆకర్షిస్తూ అక్రమ కాల్స్‌కు పాల్పడుతున్నారు. అక్రమార్జనకు పాల్పడుతున్న వీరి ఆగడాలను తపాలా శాఖ నిఘా వర్గాలు గుర్తించాయి. పోలీసులకు సమాచారమివ్వడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సెల్‌ఫోన్లు నెంబర్లు, లొకేషన్ ఆధారంగా రూట్‌కాలింగ్స్‌కు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేశారు.
నిందితుల నుంచి రూ. 4.80 లక్షలు నగదుతోపాటు 6 లాప్‌టాప్‌లు, జివోఐపీ గేట్‌వే, సిమ్‌కార్డులు, మానిటర్, సీపీయు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు అదనపు డీసీపీ చైతన్యకుమార్ తెలిపారు. నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ మధుమోహన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలం, వెంకటరాంరెడ్డి, సిబ్బంది ప్రసాద్‌వర్మ, తకియుద్దీన్‌లను డీసీపీ అభినందించారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ చైతన్య కుమార్