తెలంగాణ

రేవంత్‌రెడ్డిపై చర్య ఎందుకు తీసుకోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ రేవంత్‌రెడ్డిని ఎందుకు చేయడం లేదని టిఆర్‌ఎస్ ప్రశ్నించింది. టిఆర్‌ఎస్‌పైనా ముఖ్యమంత్రి కుటుంబంపైనా రేవంత్‌రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డికి టిఆర్‌ఎస్‌ను కానీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కానీ విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. రేవంత్‌రెడ్డి తన రాజీనామాను స్పీకర్‌ను కలిసి ఆమోదించుకుంటే తమ బలం ఏమిటో చూపిస్తామన్నారు. బ్రోకర్ గిరి చేసి డబ్బులు సంపాదించిన రేవంత్‌రెడ్డి ధనబలంతో విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలున్నా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాలరాజు డిమాండ్ చేసారు.