తెలంగాణ

పుస్తకాల దగ్ధం సభ్యత కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: విశ్వవిద్యాలయాలు సరస్వతీ నిలయాలుగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా పరిశోధనలు జరగాలని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణలోని ఒక విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు పుస్తకాలను తగులబెట్టడం శోచనీయమన్నారు. విశ్వవిద్యాలయాలు ‘విష’ విద్యాలయాలుగా మారకూడదన్నారు. పుస్తకాలను కాల్చడం ఆటవికతనానికి నిదర్శనమన్నారు. గతంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో తురుష్కులు భారతీయ గ్రంథాలను కాల్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మన విద్యార్థులే మన పుస్తకాలను తగులబెట్టారని, ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ జీవన విధానం ఉత్కృష్టమైందని పరిపూర్ణానంద పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది మాత్రమే కొత్త సంవత్సరంగా ఉంటుందని, ప్రకృతిలో కొత్తదనం వస్తుందని, అందుకే అదేరోజు వేడుకలు నిర్వహించాలన్నారు. ప్రపంచ దేశాలతో మనకు సంబంధ బాందవ్యాలు ఉన్నాయని, అందుకే ఆంగ్లతేదీలను, ఆంగ్లక్యాలెండర్‌ను గౌరవిస్తామన్నారు. జనవరి 1 న ప్రకృతిలో ఎలాంటి మార్పు ఉండదని, ఆరోజును కొత్త సంవత్సరంగా మనం జరపుకోవాల్సిన అవసరం లేదని వివరించారు.