తెలంగాణ

అణగారిన పిల్లలు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, డిసెంబర్ 27 : అనంత విశ్వంలో ప్రతి జీవి స్వేచ్ఛా జీవేనని, అణగారిన పిల్లలను ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగే పరిస్థితులను నేటి సమాజమే కల్పించాలని మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా వోలోడర్ అన్నారు. బాలల జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ, చదువు, ఆటలు, వినోదం తదితర వాటిని సమాజం నుండి పొంది వారి హక్కులపై వారికి చిన్నతనం నుండే అవగాహన ఏర్పర్చుకోవాలని ఆమె సూచించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గాడియం పాఠశాలలో బుధవారం బాలల హక్కుల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గ్లోబల్ అడ్వైజర్, ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ సతీష్ శిఖతో కలసి వోలోడర్ సదస్సులో బాలలనుద్దేశించి ప్రసంగించారు.
నిర్లక్ష్యం, దోపిడీ, వివక్షతకు గురైన బాలలు వారి హక్కుల ద్వారానే ఎదగగలరని, సమాజంలో జరిగే హింసాత్మక చర్యల నుండి రక్షణ పొందగలరని అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోందని, పేద పిల్లల సుఖమయ జీవన ప్రమాణాలకు స్వచ్ఛంద, చారిటీ సంస్థలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వోలోడర్ కోరారు. ప్రతి శిశువు చిరునవ్వుతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆశయమని దానికోసం ప్రపంచవ్యాప్త పర్యటనలు చేస్తున్నట్టు వోలోడర్ వివరించారు. బాలల హక్కులు, వారి జీవన ప్రమాణాలపై గాడియం విద్యార్ధులు చేసిన నాటక ప్రదర్శకు ఆమె చలించిపోయారు. నాటకం ద్వారా శక్తివంతమైన సందేశాన్ని అందించిన ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక సమాజంపై సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తారని వోలోడర్ కొనియాడారు.
తమ దేశంలో బాలల సమస్యలపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు లేవని, అక్కడ కూడా పిల్లలతో ఇలాంటి సదస్సులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరుపేద పిల్లల పట్ల కరుణ, సానుభూతిని కలిగి ఉండాలనే సందేశాన్ని అందించిన ఈ చిన్నపిల్లలే తనకు స్ఫూర్తి అని, ఇలాంటి ఉద్దేశాలు కలిగిన యువకుల చేతుల్లో ఉండే దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు వోలోడర్. అనంతరం గ్లోబల్ అడ్వైజర్ డాక్టర్ సతీష్ శిఖ మాట్లాడుతూ విద్యార్ధులకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి వారిని మంచి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న గాడియం పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎస్మా వోలోడర్ పేద పిల్లల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమిస్తున్నారని, బోస్నియా యుద్దంలో ప్రాణభయంతో పారిపోయిన శరణార్ధుల కుటుంబంలో వోలోడర్ జన్మించారని అందుకే అణగారిన బాలల బతుకులను మెరుగుపర్చడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని అన్నారు. వోలోడర్ లాంటి వారి సేవలు ఈ ప్రపంచానికి అవసరమన్నారు. గాడియం పాఠశాల విద్యార్ధులు పేద విద్యార్ధుల నిధి కోసం సేకరించిన రూ. 40వేలను వోలోడర్‌కు అందజేశారు. సదస్సు అనంతరం వోలోడర్ పాఠశాల విద్యార్ధులతో కలిసి కొంతసేపు గడిపారు. పిల్లలు ఇచ్చిన చిన్న చిన్న బహుమతులను ఆమె అందుకుని సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కీర్తిరెడ్డి, అడ్మిన్ హెడ్ సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ హేమ సురపనేని తదితరులు పాల్గొన్నారు.