తెలంగాణ

బెయిల్‌పై మంద కృష్ణమాదిగ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. గత పదిరోజులుగా కృష్ణమాదిగ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ తన అనుచరులతో 10 రోజుల కిందట ర్యాలీ నిర్వహించిన సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, మను ధర్మ చట్టాన్ని అనుసరిస్తోందని అన్నారు. వర్గీకరణ కోరుతూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే తనను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. తనపై అన్యాయంగా 20 కేసులు తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిందని ఆరోపించారు. చట్టాలు దొరలకు ఒకరకంగా, దళితులకు ఒకరకంగా ఉన్నాయా అని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్‌కు వెనుక ఉండి మద్దతు పలికింది ఎమ్మార్పీఎస్ అని గుర్తు చేశారు. జనవరి 1 నుంచి 5 వరకు ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్షలు చేపడుతుందని తెలిపారు.