తెలంగాణ

బీజేపీ మరింత పటిష్ఠం * పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా చాలా ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బూత్ కమిటీలు , నియోజకవర్గాల వారీ పూర్తికాలిక బాధ్యులను సిద్ధం చేశామని, వచ్చే ఏడాది పొడవునా ప్రజా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితులు, తాజా పరిస్థితులపై సమాలోచనలు చేసి, 2019 నాటికి బిజెపి అధికారంలోకి వచ్చేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదుపరి దృష్టి ఇక తెలంగాణ పైనే ఉంటుందని, తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను గెలవడానికి ప్రత్యేక ఇన్‌చార్జిలుగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్, బీహార్ రాష్ట్ర ఆరోగ్యమంత్రి మంగల్ పాండే, కేంద్ర గనులు, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్, బండారు దత్తాత్రేయ ఉన్నారని, పార్లమెంటు వారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసి, బలహీన వర్గాల ప్రజలకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.