తెలంగాణ

‘కేసీఆర్ పాలనలో మంత్రులంతా కీలుబొమ్మలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, డిసెంబర్ 27: టీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మంత్రులంతాఆయన చేతుల్లో కీలుబొమ్మలని తాండూర్‌లో చెల్లని మంత్రి మహేందర్‌రెడ్డి కొడంగల్‌లో చెల్లుతానని ఎలా పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. పోలేపల్లి, హాకీంపేట, సర్జకాన్‌పేట, నాచారం, చంద్రవంచ, ముంగిమళ్ల గ్రామాల్లో బుధవారం పార్టీ జెండా అవిష్కరణ కార్యక్రమాలను ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రి మహేందర్‌రెడ్డిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో నేడు తన సోదరుడు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో తిప్పుతున్నారని అన్నారు. పైసాకు అమ్ముడుపోయిన బిచ్చగాళ్ల వెంబడి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లరని ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ నాయకులు గుర్తించాలని అన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి గతంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారని, ఆయన రాజకీయ అనుభవంలో ఉన్నంత వయస్సు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డికి లేదని, సీనియర్ నాయకుడిగా ఉన్న గురునాథ్‌రెడ్డిని తన వెంబడి కాపాలవాడిలా తిప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని మరచి ఇతర పార్టీల నాయకులను సంతలో గొర్రెలను కొన్నట్టుగా కొంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోస్గిలో మంజూరు అయిన బస్సు డిపోకు టెండర్లు పిలవాలని, నియోజకవర్గంలోని కోస్గిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని నేటికీ స్పందించకపోవడంతో టీఆర్‌ఎస్ చేతకానితనానికి నిదర్శమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు నరేందర్, రాఘవరెడ్డి, రఘువర్థన్‌రెడ్డి, ఆసీఫ్ పాల్గొన్నారు.