తెలంగాణ

పంచాయతీరాజ్ కొత్త చట్టంతో నీతివంతమైన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, డిసెంబర్ 27: పల్లె ప్రజలకు నీతివంతమైన పాలన అందించేందుకు పంచాయతీరాజ్ కొత్త చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులోని నిలగిరిలో బుధవారం ఆయన కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ గ్రామాల్లో పటిష్టమైన పాలన సాగించేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నూతన చట్టం వల్ల గ్రామాలు, మండలాల్లో ప్రజాప్రతినిధులు ప్రజల కోసమే పని చేయాల్సిన బాధ్యతలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టం లేదన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలను గడువు లోపే నిర్వహిస్తామని చెప్పారు. అన్ని పంచాయతీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత జలాలను అందిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలో మిషన్‌భగీరథ ఫలాలు అందుకోబోతున్నామని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాదిరిగా హైదరాబాద్‌లో అసెంబ్లీ సీట్లను టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందన్నారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోని మళ్లీ టీఆర్‌ఎస్ కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అధికారంలోకి వస్తోందని జాతీయ సర్వేలు కూడా చెబుతున్నాయని గుర్తుచేశారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను టీఆర్‌ఎస్ గెల్చుకుంటుందన్నారు. జిల్లాలో ఉత్తమ్, జానాలు కూడా ఓటమి చవిచూడక తప్పదన్నారు. 47యేళ్ల కాంగ్రెస్, 18 యేళ్ల టీడీపీ పాలనలో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తుందని గుర్తుచేశారు. ఆయన వెంట మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు, బొంగు జంగయ్యగౌడ్, కంది లక్ష్మారెడ్డి, వర్కాల రవిగౌడ్ తదితరులు ఉన్నారు.