తెలంగాణ

పర్యావరణ వన్యప్రాణి సంరక్షణ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణకు స్పీకర్ చైర్మన్‌గా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసినట్టు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీకి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చైర్మన్‌గా వ్యవహరించనుండగా ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారు.
మొత్తం 11 మందితో ఏర్పాటు చేసిన కమిటీలో చైర్మన్‌గా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, సభ్యులుగా ఎమ్మెల్యేలు ఎన్ దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు, గువ్వల బాల్‌రాజు, జలగం వెంకట్‌రావు, ఎన్ పద్మావతిరెడ్డి, అక్బరుద్ధీన్ ఓవైసీ, జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్ధీన్, నారదాసు లక్ష్మణ్‌రావు, ఆకుల లలిత ఉన్నట్టు పేర్కొన్నారు.