తెలంగాణ

అక్రమాస్తుల కేసులో ఆలయ సూపరింటెండెంట్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,డిసెంబర్ 28:ఆదాయానికి మించి అక్రమాస్తులను కూడబెట్టి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఆలయ సూపరింటెండెంట్ నామాల రాజేందర్‌ను విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి దూస రాజేశ్వర్ ఉత్వర్వులను జారీ చేశారు. ప్రసాదాల తయారీవిభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నామాల రాజేందర్ ఇంటిపై ఈనెల 21న ఏసీబీ అధికారులు ముప్పెట దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదాయానికి మించి రూ.2కోట్ల 42లక్షల విలువ గల ఆస్తులున్నట్టు గుర్తించారు. ఈ మేరకు నామాల రాజేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల దాడులకు సంబంధించిన నివేదికలను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఇవో రాజేశ్వర్, రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని దేవాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తొలిదాడి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలోనే కావడం గమనార్హం. అందునా ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ ప్రాంత అభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. రాజన్న ఆలయ చరిత్రలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్‌కు గురవ్వడం ఇదే ప్రథమం.