తెలంగాణ

రాజ్యాంగంలోని 29 అంశాలను గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: రాజ్యాంగంలో చెప్పిన విధంగా 29 అంశాలను గ్రామ పంచాయితీలకు బదిలీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలన్నారు. సుప్రీం కోర్టు చెప్పి న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50శాతం మించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పంచాయితీరాజ్ బిల్లును ప్రజ ల ముందుంచి వారి సలహాలు తీసుకున్న తర్వాతనే అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభు త్వం 29 అంశాల్లో చాలా మటుకు గ్రామ పంచాయితీలకు బదిలీ చేయకపోవడంతో గ్రామ పంచాయితీలు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయాయన్నారు. గ్రామ పం చాయితీలకు నిధులు, విధులు సిబ్బంది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు జీవో ఇచ్చారని, కాని మూడేళ్లయినా అమలు చేయలేదన్నారు. 1994లో తయారు చేసిన గ్రామ పంచాయితీ చట్టంలో పెద్దగా లోపాలు లేవన్నారు. అయినా దీనిని కాదని కొత్త చటటం తీసుకురావడం అంటే వైద్యుడు చెప్పిన మందులు వాడకముందే వేరే వైద్యునికి వద్దకు వెళ్లినట్లుగా ఉందని చెప్పారు.