తెలంగాణ

జనవరి 13 నుండి ప్రపంచ పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పతంగుల పండుగను జనవరి 13 నుండి 15వ తేదీ వరకూ పెరేడ్ మైదానంలో నిర్వహించనుంది. దీనికి అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన బేగంపేట టూరిజం ప్లాజా హోటల్‌లో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్టల్ర దేశాల ప్రజల సాంస్కృతిక అంశాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. దేశంలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకత ఉన్న సీట్లు ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ ఒకే చోట ప్రదర్శించడం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజల మధ్య సన్నిహితం, పరస్పర గౌరవాన్ని పెంచడం స్వీట్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. స్వీట్ ఫెస్టివల్‌లో దేశంలో 25 రాష్ట్రాలకు చెందిన స్వీట్లను ఒకే చోట అందించడం విశేషమని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం నుండి 50 రకాల స్వీట్లను ప్రదర్శించడంతో పాటు వెయ్యి రకాల స్వీట్ల అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమ స్టీరింగ్ కమిటీలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, బెంజిమెన్‌లను నియమించారు.