తెలంగాణ

200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య కార్డులు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం కింద హెల్త్ ఆరోగ్య కార్డులను అందిస్తున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ ,రాష్ట్రప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. గురువారం సచివాలయంలో 100 మంది బ్రాహ్మణ లబ్ధిదారులకు నేషనల్ బీమా కంపెనీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్న చర్యల వల్ల ఈ స్కీంను అమలు చేయడం సాధ్యమైందన్నారు. బ్రాహ్మణ సంక్షైమ పరిషత్ ఉపాధ్యక్షులు వనం జ్వాలా నర్సింహారావు మాట్లాడుతూ వెయ్యి రూపాయలతో బీమా చేస్తే రూ.3900 బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చెల్లిస్తుందన్నారు. ఏడాది పాటు ఈ బీమా వర్తిస్తుందన్నారు. జర్నలిస్టులు, ఉద్యోగులకు ప్రభుత్వం కార్పోరేట్ తరహాలో వైద్యాన్ని అందిస్తున్నట్లుగానే పేద బ్రాహ్మణులకు కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తామన్నారు. కుటుంబంలో నలుగురికి ఈ పథకం వర్తిస్తుందని, ఏడాదికి రెండు లక్షల రూపాయల వరకు వైద్యసేవలు పొందవచ్చన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ, 19 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న ప్రతి ఒక్కరు ఈ హెల్త్ పథకం కింద అర్హులన్నారు. చకిలం అనిల్ కుమార్ లక్షా నూట పదహారు రూపాయల చెక్‌ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌కు డాక్టర్ రమణాచారికి అందించారు.

చిత్రం..200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం కింద ఆరోగ్య
కార్డులను అందజేసిన అనంతరం మాట్లాడుతున్న రమణాచారి