తెలంగాణ

గొల్ల, కురుమల భవన్‌కు నేడు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 10 ఎకరాల స్థలంలో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించబోయే గొల్ల, కురమల భవనానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. గొల్ల, కురుమల రాష్ట్ర భవనంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చే ఈ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించనున్నారు. గొల్ల, కురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం సిబిఐటి కళాశాల ప్రాంగణంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గొల్ల, కురుమల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఇప్పటికే 32 లక్షల గొర్రెలను కొనుగోలు చేసి ఇచ్చిందన్నారు. పంపిణీ చేసిన గొర్రెలకు 15 లక్షల పిల్లలు పుట్టినట్టు మంత్రి వివరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల కుల వృత్తులను ప్రోత్సహించి జీవనోపాధి కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గొర్రెలను పంపిణీ చేయడంతో ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి మాంసాన్ని దిగుమతి చేసుకోవడానికి బదులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోబోతుందన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా కోర్స్‌ల్లో ప్రవేశం కోసం శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా స్టేడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు.
గంగపుత్రులు, ముదిరాజ్‌ల జీవనోపాధి కోసం చేపల పెంపకాన్ని చేపట్టామని, చేప సంపదను పెంచడానికి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసామన్నారు. బహిరంగా సభ నిర్వహణ కోసం కల్పిస్తున్న బందోబస్తు ఏర్పాట్లను కూడా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు.

చిత్రం..గొల్ల, కురుమల భవనానికి శంకుస్థాపన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ వేదికను పరిశీలిస్తున్న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్