Others

డైరెక్టర్స్ ఛాయిస్.. నా స్వార్ధం కోసమే ఈ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- దర్శకుడు రవికాంత్ పేరేపు

అడవిశేషు, అదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘క్షణం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు
రవికాంత్. అందరిలా కాకుండా విభిన్నమైన జోనర్‌లో సినిమా చేస్తున్న రవికాంత్‌తో చిట్ చాట్..

మీ నేపథ్యం?
పుట్టి పెరిగింది వైజాగ్‌లో. బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి. మణిరత్నం సఖి సినిమా చూసి నేను కూడా సినిమా తీయాలని ఫిక్స్‌అయ్యా. వైజాగ్‌లోనే ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఇక్కడకు వచ్చా.
సినిమా ఎలా సెట్ అయ్యింది?
అడవి శేషు నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్. సినిమా చేయాలని తనతో చెప్పినప్పుడు డిగ్రీ పూర్తిచేసుకునిరా అని చెప్పారు. తర్వాత తను చేసిన కర్మ సినిమా నుండి పరిచయం.
కథేంటి?
ఇదొక సస్పెన్స్ డ్రామా. అడవి శేషుకు జరిగిన ఓ చిన్న సంఘటనను ఆధారం చేసుకుని, కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా విషయంలో నిర్మాత చాలా సపోర్ట్ అందించారు.
ఈ జోనర్‌నే ఎంచుకోడానికి కారణం?
నా మొదటి సినిమా కాబట్టి లవ్‌స్టోరీతో చేయచ్చు. కానీ అందరూ అదే చేస్తున్నారుగా, నాకంటూ ప్రత్యేక గుర్తింపురావాలనే స్వార్థంతో ఈ జోనర్‌ను ఎంచుకున్నాను.
ఈ తరహా సినిమాలే చేస్తారా?
లేదు. అన్నిరకాల జోనర్స్‌లో సినిమాలు చేయాలని వుంది. హర్రర్ మాత్రం చెయ్యను. ఎందుకంటే నాకు హర్రర్ అంటే భయం.
నెక్స్ట్ ప్రాజెక్ట్?
ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదు. కానీ త్వరలోనే ఓ లవ్ స్టోరీ చేస్తా.

-శ్రీ