బిజినెస్

రూ.6300 కోట్లతో వాటర్ గ్రిడ్ తొలిదశ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: రాష్ట్రంలో గ్రామాల్లో నీటి సమస్యకు తెరదించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం తొలిదశ పనులను 6300 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీరు అందించే ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను డ్యాష్‌బోర్డుకు అనుసంధానం చేయాలని, నీటి నాణ్యత, పనితీరు, వాడకం తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 17వేల ఓవర్ హెడ్ ట్యాంకుల్లో సెన్సర్లు ఏర్పాటు చేసి నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసి మన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ ఉందా? అనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను యుద్ధప్రాతిపదికను పూర్తి చేయాలన్నారు. లింక్ రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు నిర్మించాలని, 157 గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జనవరి చివరి వారానికి 3.5 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డంప్ యార్డుల నిర్మాణం పూర్తి అయిన 355 గ్రామాల్లో ఇంటింటికీ ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులను అందచేయాలన్నారు. మిగిలిన గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. నేషనర్ రూరల్, అర్బన్ మిషన్‌లో భాగంగా మొదటి దశలో వెంకటాచలం, కంబాదూర్, సింగరాయకొండ, అరకు, కుప్పంలో పనులు ప్రారంభించాలని కూడా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.

చిత్రం..అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్