రాష్ట్రీయం

మనకు సాటి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 17: మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు విశాఖలో జరిగే సార్క్ దేశాల మహిళా పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సదస్సును చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో సుమారు 20 సంవత్సరాల కిందటే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా, నాయకత్వ లక్షణాలను కూడా అలవరచుకున్నారని అన్నారు. కనీస విద్య కూడా లేని మహిళలు నేడు వివిధ రకాలైన వ్యాపారాలను చేసి రాణిస్తున్నారని అన్నారు. ఇది ఒక్క ఏపీలోనే సాధ్యమైందని చంద్రబాబు చెప్పారు. మహిళల్లో నిద్రాణమై ఉన్న శక్తి యుక్తులను ఇంకా ఉపయోగించుకోవాలని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా అనేక కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే అమరావతిలో మొట్టమొదటిసారిగా ఉమెన్ పార్లమెంట్‌ను నిర్వహించామని చంద్రబాబు తెలియచేశారు. ఆ సమావేశంలో చేసిన సిఫార్స్‌లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. మహిళలకు విద్య, రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చాం. ఐటీ రంగంలో మహిళలు ఎంతగానో రాణిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో అబ్బాయిలు కన్నా, అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఏ కంపెనీలోనైనా పురుషుల కన్నా, మహిళలే ఎక్కువ ఉత్పత్తి సాధిస్తున్నారని సీఎం అన్నారు. సమాజంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, కొన్నాళ్లకు అబ్బాయిలే, ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను పెళ్లి చేసుకోవలసి వస్తుందని చంద్రబాబు అన్నారు. మహిళల ప్రాధాన్యత పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా వారి పేరునే ఇస్తున్నామని చెప్పారు. ప్రతి మహిళ నెలకు 10 వేల రూపాయలు సంపాదించుకుంటే, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 24వేల ఎంఎస్‌ఎంఈలను ఇప్పటి వరకూ 700 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించామని, ఇవి
మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.
లాజిస్టిక్స్‌లో ఏపీ పటిష్ఠంగా ఉందని సీఎం చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా మెరుగ్గా ఉన్నామని అన్నారు. పరిశ్రమలకు త్వరతగతిన అనుమతులు మంజూరు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో 19 శాఖలకు సంబంధించి 13,47,801 కోట్ల రూపాయల మేర 1900 ఎంఓయూలు కుదుర్చుకున్నామని, 30 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో విశాఖలో సిఐఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సారథ్యంలో భారీ పారిశ్రామిక సదస్సు జరుగుతుందని, ఇందులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారని చంద్రబాబు తెలియచేశారు. ఆనందపురం మండలం గిడిజాలలో మహిళా పారిశ్రామికవాడ ఏర్పాటుకు కావల్సిన 50 ఎకరాల భూమిని అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రినర్స్ ఆఫ్ ఇండియాకు కేటాయిస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి బినయ్ కుమార్ మాట్లాడుతూ వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. లాజిస్టిక్ సెక్టర్‌ను వౌలిక సదుపాయల సెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం డిక్లర్ చేసిందని అన్నారు. తద్వారానే లాజిస్టిక్ పార్క్, మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సౌత్ ఏషియన్ ఉమెన్ డవలప్‌మెంట్ ఫోరం (నేపాల్) అధ్యక్షరాలు ప్రమీల ఆచార్య రిజాల్, సార్క్ సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీలు మురళీమోహన్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా పారిశ్రామిక సదస్సును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు