రాష్ట్రీయం

115 జిల్లాలకు ఏపీ ఆర్టీజీ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: వాస్తవిక సమయ, సమాచార నిర్వహణ వ్యవస్థ (రియల్ టైమ్ మోనిటరింగ్ సిస్టం) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు సహకారం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్‌కు అవగాహనా ఒప్పందం కుదిరింది.
వాస్తవిక సమయ, సమాచార నిర్వహణ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు కోర్ డ్యాష్ బోర్డు ఏర్పాటులో, నిర్వహణ సంపత్తి, సమాచార సేకరణ ద్వారా పని విధానాన్ని మెరుగుపర్చుకునే రంగాల్లో తోడ్పాటును అందిస్తుంది. దేశంలో వాస్తవిక సమయ, సమాచార నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న 115 జిల్లాలకు నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో సహకరిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్‌కు ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నీతి ఆయోగ్ తరపున సంస్థ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక అవగాహన ఒప్పందంపై నీతి ఆయోగ్ సలహాదారు డాక్టర్ అశోక్ జైన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త జిల్లా కలెక్టర్ల సమావేశంలో సంతకాలు చేశారు. సూచికల ఆధారిత డిజిటల్ వ్యవస్థకు రూపకల్పన, అభివృద్ధి, అమలులో ప్రగతి, ప్రతిభ ఆధారిత పర్యవేక్షణ అంశాల్లో నీతి ఆయోగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందజేస్తుంది. దేశంలో 115 జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తుంది. వాస్తవిక సమయ, సమాచార నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆయా జిల్లా స్థాయి అధికారులకు శిక్షణనిచ్చి, వ్యవస్థ నిర్వహణకు, ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధి, ప్రణాళికా సొసైటీ ఇప్పటికే రియల్ టైమ్ ఔట్‌కమ్ మోనిటరింగ్ సిస్టం (రోమ్స్)ను అభివృద్ధి చేసింది. ఫలితాల బడ్జెట్ రూపకల్పన నుంచి కీలక సూచికలు, అభివృద్ధి, విజన్-2019, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణకు ‘రోమ్స్’ బాట వేస్తుంది. పేదరికం, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ఆదాయ మార్గాల అవకాశాల సృష్టి, కనీస వౌలిక సదుపాయాల కల్పనతో దేశ దిశను మార్చివేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షలకు అనుగుణంగా నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేయి కలిపింది. ఇందులో భాగంగానే ఏపీఎస్‌డీ పీఎస్ సహకారం తీసుకోనుంది.