క్రీడాభూమి

2020 వరకూ జిదానే కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, జనవరి 18: కోచ్ జినెదిన్ జిదానే కాంట్రాక్టును రియల్ మాడ్రిడ్ క్లబ్ 2020 వరకూ పెంచింది. ఈ పొడిగింపు ఒప్పందం కాగితాలపై సంతకాలు చేసినట్టు ఫ్రెంచ్ మాజీ ప్రొఫెషనల్ సాకర్ హీరో జిదానే ప్రకటించాడు. అతని మార్గదర్శకంలోనే యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను రియల్ మాడ్రిడ్ కైవసం చేసుకుంది. కోపా డెల్ రే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జిదానే కోచ్‌గానూ విజయాలను రాబడుతున్నాడు. అలాంటి సమర్థుడి సేవలను కొనసాగించాలని రియల్ మాడ్రిడ్ నిర్ణయించగా, తాను కూడా సానుకూలంగా స్పందించి, కొత్త కాంట్రాక్టుపై సంతకం చేశానని జిదానే తెలిపాడు. కొత్త సీజన్ కూడా విజయవంతంగా ముగుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.