జాతీయ వార్తలు

డోక్లామ్ వద్ద స్థిరమైన నిఘా: భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: డోక్లామ్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా నిరంతర నిఘా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌పై అపోహలను నివారించేందుకు భారత్, చైనాలు తగిన వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేశాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. డోక్లామ్ వద్ద భారీ సైనిక సముదాయాలను చైనా నిర్మిస్తోందన్న వార్తలను రవీశ్ దృష్టికి విలేఖరులు తేగా, అక్కడి ‘యథాతథ పరిస్థితి’కి ఎలాంటి భంగం కలగలేదని, ఈ విషయమై వస్తున్న వార్తలు సరైనవి కావని, తప్పుదోవ పట్టించేవని అన్నారు. అయినప్పటికీ డోక్లామ్ వద్ద తాము స్థిరమైన నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఆ ప్రాంతాన్ని భద్రంగా ఉంచేందుకు భారతీయ సైనికులు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారని, ఇరుదేశాలు కూడా అపోహలను, అనుమానాలను నివృత్తి చేసేలా తగిన వ్యవస్థలను ఏర్పాటు చేశాయన్నారు. కాగా, డోక్లామ్ ప్రాంతానికి చైనా వాసులు నిర్మాణ సామగ్రిని తరలిస్తున్నారంటూ భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు రవీశ్ కుమార్ నిరాకరించారు. మరోవైపు- డోక్లామ్ వద్ద తాము చేపడుతున్న నిర్మాణాలన్నీ చట్టబద్ధమేనని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ పేర్కొనడం గమనార్హం.