జాతీయ వార్తలు

సరిహద్దు గ్రామాలు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జనవరి 19: జమ్మూలోని అర్నియా సెక్టార్‌లో పాక్ సైనికులు ఉన్మాదుల్లా విరుచుకుపడడంతో సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి నరకాన్ని తలపిస్తోంది. పాక్ రేంజర్లు దాడులు జరపడంతో పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఏ క్షణంలో ఎటు నుంచి దాడులు జరుగుతాయోనన్న భయంతో గ్రామాల్లోని ప్రజలు ‘బతుకుజీవుడా’ అనుకుంటూ సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. పాక్ సైనికుల తూటాలకు జవానే్ల కాదు, సాధారణ పౌరులు మరణిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులు గాయాలపాలవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అనేక గ్రామాలపై పాక్ సైనికులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. దీంతో తమకు అవసరమైన సామగ్రిని పట్టుకుని జనం ఇతర ప్రాంతాలకు వలస పోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘ఇది యుద్ధానికి ముందు పరిస్థితి కాదు.. నిజంగా యుద్ధమే.. ప్రాణాలు కాపాడుకోవడానికి మేం పరుగులు తీస్తున్నాం.. మా గ్రామాల్లోనే మేం దాక్కోవలసిన దుస్థితి నెలకొంది.. పాక్ సైనికులు బాంబుల వర్షం కురిపిస్తున్నందున ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదు..’ అని చాలా గ్రామాల్లో జనం ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో జనం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వంతెనల కింద తలదాచుకుంటూ నిద్రాహారాలకు దూరమవుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో 457 గ్రామాలకు చెందన సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఇపుడు భయం నీడలో బతుకుతున్నారు. పాక్ సైనికులు తమ ఆస్తిపాస్తులనే కాదు, చిన్నారుల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారని గ్రామాల్లోని వృద్ధులు, మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాంబుల మోతలు, తుపాకుల కాల్పులతో సరిహద్దు గ్రామాల్లో స్కూలు మూతపడుతున్నాయిని, ఫలితంగా తమ పిల్లలు చదువుకు నోచుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లాపాపలతో, తమకు అవసరమైన సామగ్రితో వలస పోతున్నవారికి ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా లేవు. మైళ్లకొద్దీ కాలినడకన ప్రయాణించి వీరు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సొంత ఊళ్లలో పంటపొలాలను, పాడిపశువులను వదులుకోవడం బాధాకరంగా ఉందని చాలా గ్రామాల్లోని జనం ఆవేదన చెందుతున్నారు.

ఆర్.ఎస్.పురా సెక్టార్‌నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్న గ్రామస్థులు