రాష్ట్రీయం

ప్రత్యేక హోదాపై ఉద్యమం : అంబటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల్లోని అంశాలను అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలదేనని, ఈ విషయంలో వైకాపా రాజీపడకుండా కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలపై పోరాడుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎటువంటి ప్రయత్నం చేయలేదని నీతి అయోగ్ అధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాటల ద్వారా స్పష్టమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏపికి అన్యాయం జరగకుండా ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సుప్రీం కోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. న్యాయస్థానాలకు వెళ్లాలనుకుంటే బిజెపితో పొత్తును తెగతెంపులు చేసుకోవాలన్నారు. ఆదాయంలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి హోదా ఎందుకు అని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు ప్రశ్నిస్తే, దీనికి చంద్రబాబు సరైన బదులు ఇవ్వలేకపోయారన్నారు. అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు జిడిపిని పెంచి చూపుతున్నారన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం ప్రకారం అప్పులు తెచ్చుకునేందుకు మన ఆదాయాలు నిజం కాకపోయినా పెంచి చూపుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని హైదరాబాద్ నుంచి అమరావతికి చంద్రబాబు వచ్చారన్నారు. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టుపెట్టారన్నారు.