ఆంధ్రప్రదేశ్‌

బాల భీముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జనవరి 19: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఒక మహిళ సాధారణ కాన్పులో 4.6 కిలోల బరువుగల బిడ్డకు జన్మనిచ్చిందని పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్ ఎం సౌజన్య తెలిపారు. శుక్రవారం పిహెచ్‌సిలో మూడు సాధారణ కాన్పులు జరగ్గా అందులో లక్కవరానికి చెందిన ఆరుగొల్లు అంజిబాబు భార్య అంజన 4.6 కిలోల బరువుగల మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. సాధారణంగా పుట్టిన వెంటనే బిడ్డల బరువు 2.5 కిలోలులోపే ఉంటారని, 2.5కిలోలు ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టేనని, ఒక్కో సందర్భంలో 3, లేక 3.5 కిలోలు కూడా ఉంటారని తెలిపారు. బిడ్డ బరువు పెరిగితే సిజేరియన్ చేయాల్సి వస్తుందని, అయితే ఈ కేసు విషయంలో సాధారణ కాన్పులోనే 4.6 కిలోల బిడ్డ జన్మించినట్టు తెలిపారు. బిడ్డ బరువు అధికంగా ఉన్నప్పటికీ మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఇది వైద్య శాస్త్రంలో ఒక అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ సౌజన్య పర్యవేక్షణలో స్ట్ఫా నర్స్ ఎండి దిల్షాద్‌బేగం ఈ కాన్పు చేసినట్టు హెల్త్ సూపర్‌వైజర్ పోతన సుకుమార్ తెలిపారు.