తెలంగాణ

జర్నలిస్టులకు ఆర్థిక సహాయ దరఖాస్తులకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి అవసరమైన వారికి ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ వెల్లడించింది. ఇందుకోసం దరఖాస్తు చేసేందుకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు, వారి కుటుంబాల నుండి దరఖాస్తులు వచ్చేందుకు జాప్యం జరిగే అవకాశం ఉండటం వల్ల ఈ గడువును పొడిగించాలని జర్నలిస్టుల సంఘాలు, జర్నలిస్టులు కోరుతున్నారు. జర్నలిస్టులు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే, వృత్తిలో ఉంటూ అనారోగ్యానికి గురై నడవలేని స్థితికి చేరితే సంక్షేమ నిధి నుండి ఆర్థిక సాయం అందించేందుకు మీడియా అకాడమి ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. దరఖాస్తు చేసే వారు సంబంధిత సమాచార, పౌరసంబంధాల శాఖకు చెందిన డిపిఆర్‌ఓలు లేదా సహాయ సంచాలకులు లేదా ఉపసంచాలకులు ధృవీకరించిన తర్వాత దరఖాస్తులను పంపించాలని అల్లం నారాయణ తెలిపారు. దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటి నెంబర్ 5-9-166, ఛాపెల్ రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్-500 001 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కావలసిన వారు 040-2329 8672/2329 8674 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. దరఖాస్తులను మీడియా అకాడమీ వెబ్ సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐపిఆర్.టిజి.ఎన్‌ఐసి.ఐఎన్) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.