ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగాల కల్పన, రైతులకు ఆర్థిక లబ్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: ఉద్యోగాల కల్పనతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర చెల్లించి, రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కోసం ప్రభుత్వమిచ్చే రాయితీలు దుర్వినియోగం చేసే ఆయా కంపెనీ యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్టేట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో 22 యూనిట్లకు సీఎస్ అనుమతులు మంజూరు చేశారు. యూనిట్లు ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కోట్ల రూపాయలతో ఆయా యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.. వాటి వల్ల ఎంత మందికి ఉపాధి లభించనుందో అనే వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు సీఎస్‌కు వివరించారు. స్థానిక వ్యవసాయోత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఫుడ్ ప్రాసెసింగ్ ఆయా కంపెనీ యజమాన్యాల పూర్వ పనితీరు, విశ్వసనీయతతోపాటు స్థానిక వ్యవసాయోత్పత్తుల దిగుబడుల ఆధారంగా యూనిట్ల ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముందుకొస్తున్న కంపెనీలకు బ్యాంకులిస్తున్న రుణాలు, వడ్డీల వివరాలు స్వయంగా తెలుసుకోవాలన్నారు.