ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14: ఎంపీల రాజీనామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ డ్రామాలు ప్రజలకు చెప్పాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నేతలను ఆదేశించారు. కేంద్రమంత్రులు ప్రభుత్వం నుంచి బయటకు రావడం నిమిషాల మీద పని అన్నారు. అవసరమైతే అంతకంటే పెద్ద నిర్ణయమే తీసుకుందామన్నారు. ఎంపీల రాజీనామాలపై ఇప్పటికి మూడుసార్లు మాట మార్చిన జగన్ పార్టీ అసలు ఎత్తుగడను ప్రచారం చేయాలని సూచించారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా బీజేపీ- వైసీపీ విధానాలను ప్రజలకు చాటాలని సమావేశం నిర్ణయించింది. బుధవారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులు, నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ బాగోలేదని ఒకసారి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చెబితే, బాగుందని జగన్ చెప్పారని, మళ్లీ బాగుందని విజయసాయి చెప్పడం బట్టి.. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై జగన్ పార్టీ వైఖరేమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలాగూ రాజీనామాలు ఆమోదించరు కాబట్టి ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామంటున్నారని కొందరు, ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంటే ఎన్నికలు నిర్వహించరు కాబట్టే జగన్ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని మరి కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. నిజంగా జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే రేపే వెళ్లి రాజీనామాలు సమర్పించేవాళ్లని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావని, ఇప్పుడు చేస్తేనే వస్తాయని విశే్లషించారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్న జగన్, బీజేపీని మాత్రం ఒక్కసారి కూడా విమర్శించలేదంటే వారిద్దరి మధ్య అపవిత్ర స్నేహం ఏమిటన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మరికొందరు మంత్రులు స్పష్టం చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న బాబు, అరుణ్‌జైట్లీ హోదాకు మించిన ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీ ఇస్తామంటేనే అప్పుడు మనం ఒప్పుకున్నామని, కానీ తర్వాత కేంద్రం మొండి చేయి చూపిస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. 2017 వరకూ హోదా ఉన్న రాష్ట్రాలకే ఆ రాయితీలు కల్పిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ‘అయినా మనమేమీ జగన్ మాదిరిగా చేతులు ముడుచుకుని, ప్రధాని ఉన్నప్పుడు ఒకవిధంగా, లేనప్పుడు ఒకవిధంగా మాట్లాడలేదు కదా? ధైర్యంగా లోక్‌సభలో ఆందోళన చేశాం. ఇంకా చేస్తాం కూడా. హోదా విషయంలో మనకంటే ఎవరూ గట్టిగా అడిగారు. ఒక సమస్య పరిష్కారం కాకపోతే దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం కదా? అయినా హోదాపై రాజీనామా చేస్తానని చెప్పి మాట మార్చిన జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతార’ని వ్యాఖ్యానించారు. కాగా సమావేశంలో జగన్- బీజేపీ దోబూచులాటపై పలువురు మంత్రులు చర్చించారు. బీజేపీ వాళ్లు కోరకముందే రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో జగన్ పార్టీ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. తాజాగా కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించని బీజేపీని విడిచిపెట్టి, కేంద్రంలో మంత్రిగా ఉన్నా గట్టిగా మాట్లాడిన టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బట్టి, కుమ్మక్కు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అనుమానాలు సమావేశంలో వ్యక్తమయ్యాయి. హోదాను తాము వదిలేయలేదని, బీజేపీ ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామన్న విషయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మరోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం ద్వారా అటు బీజేపీ, ఇటు అదే అంశంపై డ్రామాలాడుతున్న జగన్‌కు ఏకకాలంలో చెక్ పెడదామని సూచించగా, బాబు అంగీకరించారు. సమావేశంలో మంత్రులు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.