విశాఖ

వౌళిక వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఫిబ్రవరి 16: గ్రామాలలో నిర్వహించే ఉపాధి హామీ పధక పనులను సద్వినియోగం చేసుకునేలా పూర్తి స్థాయిలో వౌళిక వసతులు కల్పించాలని పంచాయిత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో ఉపాధి హామీ పధకం పనుల ప్రగతిపై వీడియోకాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాకు నిర్ణయించిన రూ.2.46 కోట్ల పనిదినాల లక్ష్యంలో ఇప్పటి వరకూ ఒక కోటి 70 లక్షల పని దినాలు సాధించామని, మిగిలిన లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా సాధిస్తామన్నారు. గత ఏడాది 2.27 కోట్ల పని దినాలు సాధించగా ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని అధిగమిస్తూ 2.46 కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించామన్నారు. రోజుకి 1.72 లక్షల కూలీలు పనులకు హాజరుకావాల్సి ఉందని, అయితే ప్రస్తుతం 1.25 లక్షల కూలీలు మాత్రమే పనులకు హాజరవుతున్నారన్నారు. రానున్న రోజుల్లో లక్ష్యానికి మించి కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు చేపడతున్నామన్నారు. 520 కి,మి సీసీరోడ్ల లక్ష్యంలో 288 కిలో మీటర్లు రోడ్ల పనులు, 514 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మాణ లక్ష్యంలో 244 అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణ పనులు పూర్తి చేశామని, మిగిలిన లక్ష్యాన్ని ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపులోగా సాధిస్తామన్నారు. లక్ష్యంగా నిర్ణయించుకున్న 25 వేల వ్యక్తిగత మరుగుదోడ్లను మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న 77 ఫీల్డు అసిసెంట్ల పొస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామన్నారు. ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతంలో నెట్ వర్కు సమస్యల కారణంగా బ్యాంకుల నుంచి పొస్ట్ఫాసులకు నగదు బదిలీ ఆలస్యం అవుతుందని, వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం అవుతుందని మంత్రికి వివరాంచారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి కళ్యాణ చక్రవర్తి, డిపి ఓ కృష్ణవేణి, నీటి పారుదల శాఖ అధికారలు పాల్గొన్నారు.