వరంగల్

రైతుల కన్నీళ్లతో టీఆర్‌ఎస్ కొట్టుకు పోవడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, ఫిబ్రవరి 18: ఎకరాకు రూ. 4వేలు కావాలని రైతులు అడగడం లేదని రూ. 7వేల మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారని, రైతు కన్నీళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుక పోవడం ఖాయమని వరంగల్ రూరల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసాచారి అన్నారు. ఆదివారం పరకాల వ్యవసాయ మార్కెట్‌ను టీడీపీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మార్కెట్‌కు తీసుక వచ్చిన పత్తి రైతులతో మాట్లాడారు. జగ్గయ్యపేటకు చెందిన మహిళా రైతు, గోవిందాపూర్‌కు చెందిన రైతు మందాడి కుమారస్వామిలు తాము కష్టపడి పంట సాగు చేస్తే పంట దిగుబడి తగ్గిందని, గిట్టుబాటు ధర రావడం లేదని చేసిన అప్పులు తీర్చే దిక్కు లేదని టీడీపీ బృందం సభ్యుల దృష్టికి తీసుక వచ్చారు. నాణ్యమైన పత్తికి ధర లేకపోవడం, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో మా ర్కెట్‌లో రూ. 3వేలు కూడా పత్తి పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. దళారులకు కొమ్ముకాస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే రైతుల బతుకులు బాగుపడుతాయని, పురుగుల మందు తాగాల్సిన అవసరం ఉండదని తెలంగాణ ప్రభుత్వం పెరుగన్నం తినిపిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారని తెలిపారు. కేసీఆర్ 4 సంవత్సరాల పాలనలో సుమారు 3800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. రైతులు మార్కెట్లో ఇబ్బందులు పడుతున్నా కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు మార్కెట్‌కు వచ్చి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పే సమయం లేదా అని ప్రశ్నించారు. రైతుల ఉసురు ఊరికే పోదని, రైతుల కన్నీళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రూ. 7వేల మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల టీడీపీ పట్టణ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు తోట రవీందర్, లక్కం ప్రకాశ్, పత్తిపాక రవీందర్, దుబాసి అనిల్, రాజేష్, దిలీప్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
* గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి చందూలాల్
వెంకటాపురం (రామప్ప), ఫిబ్రవరి 18: తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. ఆదివారం వెంకటాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి చందూలాల్ పాల్గొన్నారు. మండలంలోని గుర్రంపేటలోగ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని మంత్రి చందూలాల్ ప్రారంభించారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, మండలంలోని భావ్‌సింగ్ పల్లి, సుబ్బక్కపల్లి, రాంనాయక్ తండా, పెద్దాపూర్, మల్లయ్యపల్లి, వెంకటేశ్వరావుపల్లి, అడవి రంగాపూర్ కొత్తపల్లి, లక్ష్మీదేవిపేట, లంబాడి తండా, నర్సింగాపూర్, హేమ్‌నాయక్‌పల్లి నల్లకుంట తదితర గ్రామాలలో సీసీ రోడ్డను మంత్రి ప్రారంభించారు. అడవి రంగాపూర్‌లో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం, వెంకటాపురంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి చందులాల్ మాట్లాడారు.