హైదరాబాద్

తెలుగును బోధన భాషగా ప్రకటించకపోవడం శోచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 18: కోట్ల రూపాయాలను ఖర్చు చేసి ఎంతో అర్భాటంగా తెలుగు ప్రపంచ మహాసభలను నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఇంత వరకు తెలుగును బోధన భాషగా ప్రకటించక పోవడం దురదృష్టకరమని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యామ్నాయ భావ ప్రకటన ఐక్య వేదిక (చాటింపు) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ మహాసభలకు వంద కోట్ల రూపాయలు కేటాయించి సాధించిదేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జానపద, సంగీత, నాటక అకాడమీలు ఏర్పాటు చేయకుండా కేవలం సాహిత్య అకాడమీనే ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ప్రపంచ మహాసభ ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మహాసభల తీర్మానాలు వెల్లడిస్తామని ప్రకటించారని కానీ ఇప్పటి వరకు తీర్మానాలు స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలకు నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రచయితలు రాసిన గ్రంథాలను జిల్లాకు వంద చొప్పున కొని గ్రంథాలయాలలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రచయితల సహకార కోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని సూచించారు. ఆధునిక భాషగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా సహకారం అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక రంగాల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో చాటింపు కన్వీనర్ వినాయక్ రెడ్డి, మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, పొట్లపల్లి ఫౌండేషన్ అధినేత పొట్లపల్లి వరప్రసాద రావు పాల్గొన్నారు.