ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్ సమావేశాల్లో బాబు సర్కారుపై అవిశ్వాసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలు పలువురు తెలుగు దేశం పార్టీలోకి ఫిరాయించడం, రానున్న బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంవంటి అంశాలపై చర్చించేందుకు వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. కాగా సమావేశానికి 14 మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ అంశంపై జగన్ పార్టీ ఎమ్మెల్యేలందరితో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేయాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, స్పీకర్ దానిని తప్పకుండా చర్చ చేపట్టాల్సి వస్తుందని, అప్పుడు తమ పార్టీనుంచి ఇటీవల ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని భావించారు. విప్ జారీ చేసినప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానిని ధిక్కరిస్తే, వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటీషన్ దాఖలు చేసేందుకు ఉపయోగపడుతుందని వారు నిర్ణయించారు. పైగా ప్రభుత్వ తప్పిదాలను తూర్పారబట్టేందుకు ఉపయోగపడుతుందని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినప్పటికీ, దానిపై స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానినీ ప్రశ్నించాలని వారు నిర్ణయించారు. ఇలాఉండగా పార్టీ ఎమ్మెల్యేలు జయరాం, గౌరు చరితా రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయి ప్రసాదరెడ్డి, పి. రామచంద్రారెడ్డి, ఎం. గాంధీ, సుజయకృష్ణ రంగారావు, శివప్రసాదరెడ్డి, కె. సర్వేశ్వర్ రెడ్డి, తిప్పిరెడ్డి, నాని, కె. వెంకటరమణ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పోలవరానికి అరకొర కేటాయింపులు

ఇలా అయితే మూడేళ్లలో నిర్మాణం కష్టమే

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 29: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు అరకొరగా కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు భారీగా కేటాయింపులు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆశపడ్డారు. నామమాత్రపు నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విభజన హమీలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా అవమానించిందన్న ఆగ్రహాన్ని రాష్ట్రప్రజలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి చేసిన ఖర్చు రూ.8500 కోట్లు. 2004లో తొలిసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన అంచనా విలువ సుమారు రూ.10వేల కోట్లయితే, తరువాత సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.16వేల 100కోట్లకు చేరుకుంది. మళ్లీ సవరించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు ప్రకారం చూస్తే ఇప్పుడీ అంచనా విలువ రూ.22వేల కోట్లకు చేరుకుంది. అంటే ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.8500 కోట్లు తీసివేయగా, ఇంకా సుమారు రూ.14వేల కోట్లు ఉంటే తప్ప ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పదే పదే చేస్తున్న ప్రకటనలు నిజం కావాలంటే ఏడాదికి కనీసం రూ.5వేల కోట్లను కేంద్రప్రభుత్వం విడుదలచేయాలి.
పోలవరం ప్రాజెక్టుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేనినేని ఉమ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. గత బడ్జెట్‌లో కూడా ఇలాగే రూ.100కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, తరువాత వెయ్యి కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించి రూ.645కోట్లు మాత్రమే మంజూరుచేసింది. ఇందులో కూడా ఇప్పటివరకు విడుదలయింది కేవలం రూ.300కోట్లు మాత్రమే. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చులో ఇంకా విడుదలకావాల్సింది రూ.1200కోట్లు. అంటే కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులు పాత బిల్లులు చెల్లించేందుకే సరిపోవన్న మాట. బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉన్నా, ప్రాజెక్టుకు ఎంత కావాలంటే అంత విడుదలచేస్తామని గతంలో కూడా చెప్పిన కేంద్రం కేవలం రూ.645కోట్లు మాత్రమే విడుదలచేసింది. ఇదే పద్ధతిలో ఈ ఏడాది కూడా ఇలాగే నిధులు విడుదలచేస్తే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలగా ఉన్న పోలవరం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తునకు
సిఐడికి ప్రభుత్వం అనుమతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 29: అగ్రిగోల్డ్ కంపెనీకి చెందిన ఆస్తులను సిఐడి జప్తు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 30 లక్షల మంది ఖాతాదారులను మోసగించిన కేసులో అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిఐడికి అనుమతించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లను మోసం చేసి సుమారు రూ.700 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డంపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశలో ఆస్తుల జప్తునకు అనుమతిస్తూ జివో జారీ చేసింది.

ఈ మేరకు సిఐడి అదనపు డిజి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.