క్రైమ్/లీగల్

బ్యాంకు అక్కౌంట్ల నుంచి ఆన్‌లైన్‌లో నగదు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బ్యాంక్ అక్కౌంట్ల నుంచి ఆ ఖాతాదారులకు తెలియకుండా నగదు బదిలీ చేసి చోరీ చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన సుభాష్‌కుమార్, మనోజ్‌కుమార్ బాల్ అనే ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరిద్దరు బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లుగా నమ్మించి పలువురు బ్యాంకు ఖాతా దారుల నుంచి సమాచారం తీసుకుని దానిని అంతర్‌రాష్ట్ర మోసగాళ్లకు అందిస్తున్నారు. వీరిచ్చిన సమాచారంతో వారు బ్యాంకు ఖాతాదారులను సులభంగా మోసం చేస్తున్నారు. మీ డెబిట్, క్రెడిడ్ కార్డులు బ్లాక్ అయ్యాయని, లేదా వాటి కాలపరిమితి ముగిసిందని ఇలా ఏదోఒకటి చెప్పి వారి నుంచి ఆ కార్డు నెంబర్, సివివి నెంబర్, పిన్ నెంబర్, అక్కౌంట్ నెంబర్ కావాలని ఆ వివరాలు తీసుకుంటారు. వాటిని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే అంతర్ రాష్ట్ర మోసగాళ్లకు చేరవేస్తారు. వారు బ్యాంక్ ఖాతాల నుంచి నగదును ఈ-కామర్స్ వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని ఆ తర్వాత ఆ మొత్తాన్ని సొంత ఖాతాల్లోకి తరలించుకుంటారు. సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లికి చెందిన మహ్మద్ సమియుల్లాఖాన్, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన కె.కామాక్షిలు తాము మోసపోయినట్లు సిసిఎస్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారని డిసిపి తెలిపారు. తాము బ్యాంకు అధికారులమని చెప్పి వారి నుంచి ఖాతా వివరాలు, కార్డు వివరాలు తెలుసుకోవడమే కాకుండా ఒటిపి నెంబర్ కూడా తెలుసుకుని ఒకసారి రూ.89,986, మరోసారి రూ.97,547 మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా నిందితులు జార్ఖండ్‌లో ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సిసిఎస్ సైబర్ పోలీసు బృందం జార్ఖండ్ వెళ్లి నిందితులను పట్టుకుంది. అక్కడి నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు వచ్చి వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఎస్‌ఐ డి.ప్రశాంత్, ఇన్‌స్పెక్టర్ విపి తివారిలు సైబర్ నేరాల అదనపు డిసిపి కెసిఎస్ రఘువీర్ ఆదేశాలతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.