రాష్ట్రీయం

ఆటోమొబైల్ హబ్‌గా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 22: వ్యవసాయాధార ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కియా మోటార్స్ ఇండియా సంస్థకు సంబంధించి 15వ యూనిట్ ఫ్రేమ్ ఇన్‌స్టలేషన్ పనులను గురువారం సంస్థ సీఈఓ హాన్ వూ పార్క్‌తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. తర్వాత కియా కంపెనీకి సంబంధించి స్క్రీన్‌ను ఆవిష్కరించి డిజిటల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో సీఎం మాట్లాడుతూ నూతన ఆవిష్కరణకు నిలయంగా రాష్ట్రాన్ని రూపొందిస్తామన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కియా కంపెనీ యూనిట్‌లో ఏడాదికి 3 లక్షల యూనిట్లు (కార్లు) తయారు చేస్తారని, అయితే 4 లక్షల కార్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. రాబోయే రోజుల్లో 10 లక్షల కార్లు తయారు చేయాలని ఆకాంక్షించారు. భారతదేశంలో మార్కె ట్ విస్తృతంగా ఉందని, అందుకు అనుగుణంగా కార్ల మార్కెట్ కూడా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలకన్నా అధికంగా రాయితీలు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో కియా కంపెనీ నిర్మాణం పనులు ప్రారంభిస్తున్న ఈ రోజు చారిత్రాత్మకమన్నారు. రూ.12,900 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 లక్షల కార్లు ఇక్కడ తయారవుతాయన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన కియా కార్ల కంపెనీ బ్రాండ్ స్లోగన్ ‘ద పవర్ టు సర్‌ప్రైజ్’ అయితే, ఆంధ్రప్రదేశ్ స్లోగన్ ‘ఇన్నొవేషన్ వ్యాలీ’ అని చంద్రబాబు ప్రకటించారు. దక్షిణ కొరియా కియా సంస్థకు మొదటి ఇల్లు అయితే,
రెండో ఇంటిగా ఏపీని చేసుకోవాలని సంస్థ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ హాన్ వూ పార్క్‌ను చంద్రబాబు కోరారు. కొరియన్ కంపెనీలతో పాటు ప్రముఖ కంపెనీలూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. మూడున్నరేళ్లలో హంద్రీనీవాను పూర్తి చేసి అక్కడి నుంచి గొల్లపల్లికి నీటిని తరలించడం, పెనుకొండ ప్రాంతంలో అవసరమైనంత భూమి ఉండటం వల్ల కియా ఏర్పాటు సాధ్యమైందన్నారు. రాజధానిలో అక్కడి రైతులు 3వేల ఎకరాలు భూములిచ్చి ప్రభుత్వానికి సహకరించారని, అలాగే ఇక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి తమ భూములు ఇవ్వడం వల్ల త్వరితగతిన కియా కంపెనీ ఏర్పాటు సాధ్యమైందంటూ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కియా టౌన్‌షిప్, ట్రైనింగ్ సెంటర్, టెర్మినల్స్, రైల్వే సైడింగ్స్ నిర్మాణాలకు పెనుకొండలో 675 ఎకరాలతోపాటు, అమ్మవారిపల్లి, గుడిపల్లెవద్ద అదనంగా 335 ఎకరాలు కేటాయించామన్నారు. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిలో అనంతపురం ఉందని, బెంగళూరు- హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం- చెన్నై, బెంగళూరు- చెన్నై కూడా పరిశ్రమల కారిడార్‌లుగా ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా కృష్ణపట్నం ఎయిర్‌పోర్టుతో అనుసంధానానికి అనుకూలంగా ఉండటంతో మంచి మార్కెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడానికి కియా సంస్థ సీఈఓ హాన్ వూ పార్క్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని సీఎం ప్రశంసించారు. అనంతపురం జిల్లాలోని కియా యూనిట్‌లో తయారయ్యే కార్లు 90 శాతం దేశీయ మార్కెట్లో విక్రయిస్తారని, మిగతా 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారని సీఎం అన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యేకంగా 4000, పరోక్షంగా 7000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. కాగా 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా కియా సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూలో ఉందన్నారు. భవిష్యత్తులో టైర్-2 కింద మరో 60-70 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ప్రస్తుతం 995 పరిశ్రమలు పురోగతిలో ఉన్నాయన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఈనెల 24న విశాఖపట్నంలో మూడో పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కియా రావడానికి పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోక్యరాజ్, పరిశ్రమల మంత్రి, అనంతపురంలో ఇదివరకు పని చేసిన కలెక్టర్లు, ప్రస్తుత కలెక్టర్, ఏపీఐఐఐసీ అధికారుల కృషి ఫలితమేనన్నారు.

చిత్రం..కియా ప్రేమ్‌పై సంతకాలు చేస్తున్న సీఎం చంద్రబాబు, కంపెనీ ప్రిసిడెంట్ హాన్ వూ పార్క్