జాతీయ వార్తలు

అవినీతిలో ఎదుగుతున్నాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఇరుగు పొరుగు దేశాలతో పోలిస్తే, ముఖ్యంగా చైనాతో పోల్చి చూస్తే భారత్‌లో అవినీతి ఎక్కువేనని, అయితే కొన్ని పొరుగు దేశాలతో పోలిస్తే ఇండియాలో ధరలు తక్కువగా ఉంటున్నాయని ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. అయితే 2015లో ఈ సూచీలో 38వ ర్యాంకు సాధించిన భారత్ 2016లో కాస్తంత మెరుగుపడి (అవినీతి తగ్గి) 40వ ర్యాంకు పొందింది. 2017లో అదే ర్యాంకును నిలబెట్టుకోగలిగింది.
ప్రపంచ దేశాల ప్రభుత్వరంగ సంస్థల్లో అవినీతి తీరుతెన్నులను పరిశీలించే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ తాజాగా ‘కరప్షన్ పెర్సప్షన్ ఇండెక్స్- 2017’ను విడుదల చేసింది. ఆ జాబితాలో భారత్‌కు 40 పాయింట్లతో 81వ ర్యాంకు లభించగా 41 మార్కులతో చైనా 77వ ర్యాంకు సాధించింది. అంటే మనదేశంలోకన్నా చైనాలో అవినీతి తక్కువన్నమాట. అలాగే 67 మార్కులతో 26వ ర్యాంకు సాధించిన భూటాన్ ఈ జాబితాలో ఆసియాలోనే మెరుగైన స్థానం సాధించింది. దాదాపు 180 దేశాల్లో పరిస్థితులను పరిశీలించిన ఆ సంస్థ ‘అవినీతి సూచీ’నీ ప్రకటించింది. మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌కు 32 పాయింట్లతో 117వ ర్యాంకు, 28 పాయింట్లతో బంగ్లాదేశ్‌కు 143, మయన్మార్‌కు 30 పాయింట్లతో 130వ ర్యాంక్, 38 మార్కులతో శ్రీలంకకు 91వ ర్యాంకులను ఆ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వరంగ సంస్థల్లో నెలకొన్న అవినీతిపై వ్యాపారవాణిజ్య రంగాలకు చెందిన నిపుణుల బృందం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా దేశాలకు ‘0’ నుంచి 100 పాయింట్లను కేటాయించారు. ‘0’ పాయింట్లు అతి ఎక్కువ అవినీతిని, ‘100’ పాయింట్లు ‘పూర్తి నీతిమయ’ స్థితిని వెల్లడిస్తాయి. ఆయా దేశాలకు ఇచ్చిన పాయింట్ల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. ర్యాంకు సంఖ్య పెరుగుతున్న కొద్దీ అవినీతి ఎక్కువగా ఉన్నట్లు అర్థం. తాజా నివేదిక ప్రకారం ఈ జాబితాలో న్యూజిలాండ్, డెన్మార్క్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అంటే ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థల్లో మచ్చుకైనా అవినీతి లేదని అర్థం. ఇక ఈ జాబితాలో సిరియా (14 పాయింట్లు), దక్షిణ సూడాన్ (12 పాయింట్లు), సొమాలియా (9 పాయింట్లు) చివరి మూడు స్థానాల్లోనూ నిలిచాయి. ఇక 66 పాయింట్లతో పశ్చిమ ఐరోపా అత్యుత్తమ ప్రాంతంగా ర్యాంకు పొందిగా 32 పాయింట్లతో సబ్‌సహారా, 34 పాయింట్లతో తూర్పు ఐరోపా, మధ్య ఆసియా అత్యంత అవినీతిమయ ప్రాంతాలుగా నిలిచాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలున్న ‘బ్రిక్స్’ దేశాలలో 71వ ర్యాంకుతో దక్షిణాఫ్రికా మెరుగైన స్థానంలో ఉండగా చైనా, భారత్ నిలిచాయి. కాగా బ్రెజిల్‌కు 96, రష్యాకు 135వ ర్యాంకు లభించాయి. కాగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని దేశాల ప్రభుత్వరంగ సంస్థల్లో నెలకొన్న అవినీతిలో చాలా తారతమ్యాలున్నాయన్న నివేదిక 50కన్నా తక్కువ పాయింట్లే సాధించాయని పేర్కొంది. ‘ఆ ప్రాంతంలో అవినీతి జాడ్యంగా మారిపోయింది. దానిని నిర్మూలించాలన్న బలమైన రాజకీయ కాంక్ష, సంపూర్ణ వ్యూహాన్ని అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది తప్ప, ఏదో ఒక చర్యవల్ల సమస్య సమసిపోదు’ అని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అరాచకం
అవినీతి విషయంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ రీజియన్‌లో అరాచక పరిస్థితులున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో న్యాయవాదులు, ఉద్యమకారులు, ప్రతిపక్ష నేతలు, న్యాయాధికార సంస్థల ప్రతినిధులు, నిఘాసంస్థలు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని దేశాల్లో హత్యలూ జరుగుతున్నాయని పేర్కొన్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ఈ విషయంలో ఫిలిప్పీన్స్, ఇండియా, మాల్దీవులు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అవినీతి, పత్రికాస్వేచ్ఛ తక్కువగా ఉండి, పాత్రికేయుల హత్యలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో ఈ మూడూ ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది.