ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకాభివృద్ధి ఎంవోయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: వౌలిక సదుపాయాలు మెరుగుపడితేనే రాష్ట్రంలో పర్యాటక ప్రగతి సాధ్యమవుతుందని, అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖలో జరుగుతున్న మూడవ విడత భాగస్వామ్య సదస్సులో రూ.7,806 కోట్ల పెట్టుబడులతో 56 ప్రాజక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. తద్వారా 33,123 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ప్రస్తుతం వౌలిక సదుపాయాల కల్పన మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యాటకులకు వసతి సదుపాయం పెద్ద సమస్యగా ఉందని, కేవలం 8 నుంచి 9 వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంఖ్య 25వేలకు పెరగాల్సి ఉందన్నారు. వచ్చే 2025 నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తే పర్యాటకం పరుగులలు తీస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలు అవరోధాలుగా ఉన్నాయన్నారు. కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు అందడం ఆలస్యం అవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికులే ఎక్కువగా వస్తున్నారని, సాధారణ పర్యాటకుల సంఖ్య పెరగాల్సి ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పలువురు ఔత్సాహిక వేత్తలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నారు.