ఆంధ్రప్రదేశ్‌

వృత్తి నైపుణ్యంతోనే ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యత పెరిగినప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖల కార్యదర్శి రమేష్ అభిషేక్ అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా ఏపీ పెవిలియన్‌లో నూతన పారిశ్రామిక విధానంపై శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1991 తరువాత భారత పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అప్పటి వరకూ కేవలం 4 శాతం మాత్రమే పారిశ్రామిక ప్రగతి నమోదు కాగా, తదనంతరం వేగం పుంజుకుందన్నారు. పరిశ్రమలు నూతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తిలో వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యతను పెంపొందిచేలా వృత్తి శిక్షణ కేంద్రాలు పెరగాలన్నారు. దీనికి కేంద్రం విస్తృత ప్రాధాన్యతనిస్తోందని గుర్తు చేశారు. పరిశ్రమలను, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ధికాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి చోదకంగా పనిచేస్తుందన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని, దీన్ని అధిగమించగలిగితేనే ఆర్థికంగా వృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకపోవడం వల్లే వెనుకబడ్డామని, ఈ సమస్యను అధిగమించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా వౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగాలన్నారు. రాష్ట్రంలో 2015-20 సంవత్సరానికి గాను, నూతన పారిశ్రామిక విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. పారిశ్రామికంగా సంస్కరణలు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. అనుమతుల మంజూలో జాప్యాన్ని నివారించేందుకు టైం బాండ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా భవిష్యత్ తరాలకు ఆటోమోబైల్ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమోబైల్ రంగంలో 15 సంస్థలు రూ.15,224 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 57,368 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అలాగే పారిశ్రామిక రంగంలో నాలుగు సంస్థలు రూ.1,515 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 2,100 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులపై ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

చిత్రం..ఎంవోయూలు కుదుర్చుకుంటున్న దృశ్యం