కృష్ణ

ఏ.కొండూరులో డయాలసిస్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ. కొండూరు, ఫిబ్రవరి 24: స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు బి లక్ష్మీకాంతం వెల్లడించారు. మండలంలోని కృష్ణారావుపాలెం పంచాయితీ శివారు దీప్లానగర్ తండా, మాన్‌సింగ్ తండాలను శనివారం సందర్శించి కిడ్నీ బాధితులను పరామర్శించి వ్యాధి లక్షణాలను గురించి అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటే నీటి పరీక్షలు నిర్వహించి అవసరమైన చోట ఆర్‌డబ్యుఎస్ ఆధ్వర్యంలో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రాధమిక సర్వేలో 19 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఉన్నారని, ఇకనుండి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదని, ప్రభుత్వపరంగా ఎ కొండూరు పీహెచ్‌సీలో డయాలసిస్ సెంటరును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బాధితులకు వైద్య సేవలు అందించడానికి 4 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి సోకి గతంలో మృత్యువాత పడ్డ కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత అందించనున్నట్లు తెలిపారు. వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ సెంటరులో ఏడు వారాలకు సంబంధించిన కిట్స్ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లాను పైలట్‌ప్రాజెక్టు జిల్లాగా ఎంపిక చేసి రూ.869 కోట్లతో ఏడు లక్షల కుటుంబాలకు ఇంటింటికి మంచినీటి కుళాయిల ద్వారా స్వచ్చమైన తాగునీరు అందించనున్నట్లు, ఈ పథకానికి మొదటిగా మండలంలోని దీప్లానగర్ తండాలో ఏప్రిల్ 1న ప్రారంభించనున్నట్లు చెప్పారు. డయాలసిస్ చేయంచుకున్న రోగులు తీసుకోవాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పించడానికి సైకోసోషల్‌కేర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ఇకనుండి జాయింట్ కలెక్టరు విజయకృష్ణ, ఆర్‌డీఓ సీహెచ్ రంగయ్య, జిల్లా వైద్యాధికారిణి పద్మజారాణి, డెప్యూటి డిఎంఅండ్‌హెచ్‌ఓ ఆశ, తహశీల్దార్ సురేష్‌కుమార్ ఎంపీడీఓ నాంచారరావు, పీహెచ్‌సీ డాక్టర్ అనుష ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని కలెక్టరు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీఓ రంగయ్య రామచంద్రాపురం శివారు లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించి తాగునీటిలో ఫ్లోరైడ్ ఎంత శాతం ఉందో పరీక్షలు కోసం ల్యాబ్‌కు పంపాలని ఆర్‌డబ్యుఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాసం మునీయ్య, మండల టీడీపీ అధ్యక్షులు అలవాల రమేష్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి, సర్పంచ్ పి శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.