రాశిఫలం 03/13/2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
ఏకాదశి మ.12.59, కలియుగం - 5119 శాలివాహన శకం - 1939
నక్షత్రం: 
ఉత్తరాషాఢ మ.12.03
వర్జ్యం: 
సా.6.19 నుండి 8.05 సా.4.27 నుండి 6.12 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.): ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.): ఆకస్మిక ధనలాభముంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.): వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష): అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవ దర్శనం లభిస్తుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.): నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.): నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.): ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ): ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,): ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.): తోటి వారితో విరోధ మేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.): ఋణ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి): మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
Date: 
Tuesday, March 13, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి