జాతీయ వార్తలు

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్08 రాకెట్ ప్రయోగం 29న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 29వ తేదీన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం, ఏప్రిల్ రెండో వారంలో పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇందులో జీఎస్‌ఎల్‌వీ ద్వారా జీశాట్-6ఎ సమాచార రంగానికి చెందిన ఉపగ్రహాన్ని, పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే జీశాట్-6ఎ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి షార్‌కు చేరింది. ఉపగ్రహానికి వివిధ పరీక్షలు నిర్వహించి రాకెట్ శిఖర భాగాన అమర్చే ప్రక్రియలో శాస్తవ్రేత్తలు ఉన్నారు. ఈ ప్రయోగం మార్చి 29న రెండో ప్రయోగ వేదిక నుంచి జరగనుంది.
లోపాన్ని సరిచేసిన శాస్తవ్రేత్తలు
ఇదిలావుండగా మొదటి ప్రయోగ వేదికపై పిఎస్‌ఎల్‌వి-సి 41 రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి రెండో అనుసంధాన పనులు జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. మొదటి దశ నుంచి రెండో దశకు అమర్చే ఎలక్ట్రికల్ కన్వటర్ ఫ్లెగ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుసంధాన పనులు ఆగిపోయాయి. రెండు దశల మధ్య అమర్చే ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన ఫ్లెగ్ సరిపడకపోవడంతో అనుసంధాన పనులు ఆగిపోయాయి. వెంటనే శాస్తవ్రేత్తలు ఆ ఎలక్ట్రికల్ ఫ్లెగ్‌ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి) నుంచి రప్పించి మంగళవారం మధ్యాహ్నానికి రెండో దశ అనుసంధాన పనులు పూర్తిచేశారు. బుధవారం మూడో దశ, నాలుగో దశ అనుసంధాన పనులు పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం రూపకల్పన బెంగళూరులో జరుగుతోంది. ఈనెలాఖరులో శాటిలైట్‌ను షార్‌కు తీసుకురానున్నారు. మార్చి 30 నుంచి రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 12న పిఎస్‌ఎల్‌వి-సి 41 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నట్లు సమాచారం.

చిత్రం..సాంకేతిక లోపం తలెత్తిన పీఎస్‌ఎల్‌వీ రెండో దశ ఇదే