జాతీయ వార్తలు

బీజేపీ-టీడీపీ మళ్లీ దోస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: బీజేపీ-టీడీపీ తిరిగి కలిసే అవకాశాలున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు. గురువారం మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే బీజేపీ-వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కుయ్యాయంటూ టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నోసార్లు యూ-టర్న్ తీసుకున్నారని, నాలుగేళ్లుగా బీజేపీతో కావురం చేసి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే ఏప్రిల్ ఆరున రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. తామిచ్చిన అవిశ్వాస తీర్మానానికి సహకరించాలని పార్లమెంట్‌లోని అన్ని పార్టీలను కోరుతున్నామని వెల్లడించారు. మొదటినుంచీ లాలూచీ రాజకీయాలు టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. విభజన హామీలకోసం నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తోందని, ఆ వియాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజూ పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయడం కేంద్ర ప్రభుత్వానికి సమంజసం కాదని, తాము స్పీకర్‌కి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపించాల్సిందే ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం కూడా వైస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్ ముఖద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీకి న్యాయం చేయాలంటూ నిరసన కొనసాగించారు.

చిత్రం..ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు